Ruckus in Chandrababu Punganur Tour: పథకం ప్రకారమే పోలీసులపై దాడి, పుంగనూరు ఉద్రికత్తలపై స్పందించిన చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి

టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు.

Chittoor SP-Rishant (Photo-Video Grab)

టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు టూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీటీడీ, వైసీపీ శ్రేణులు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.ఈ ఘటనపై చిత్తూరు ఎస్పీ రిషాంత్‌ రెడ్డి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. పథకం ప్రకారమే పోలీసులపై దాడి చేశారు.

చంద్రబాబు పుంగనూరు హైవే మీదుగా చిత్తూరు వెళ్లాల్సి ఉంది. రూట్‌ మార్చి పుంగనూరు వచ్చేందుకు ప్రయత్నించారు. పుంగనూరులోకి రాకుండా టీడీపీ శ్రేణులను అడ్డుకున్నాం. అడ్డుకున్న పోలీసులపై టీడీపీ శ్రేణులు దాడులకు దిగారు. విచక్షణారహితంగా దాడులు చేశారు. బీర్‌ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో టీడీపీ కార్యకర్తలు అక్కడికి వచ్చారు. ముందస్తు ప్లాన్‌ ప్రకారమే దాడి చేశారు. టీడీపీ శ్రేణుల రాళ్ల దాడిలో 50 మందికిపైగా గాయపడ్డారు. రెండు పోలీసు వాహనాలను తగలబెట్టారు. దాడులకు దిగిన టీడీపీ శ్రేణులను అరెస్ట్‌ చేస్తాం. దాడుల వెనుక ఎంత పెద్ద వ్యక్తులను అరెస్ట్‌ చేస్తామని స్పష్టం చేశారు.

Chittoor SP-Rishant (Photo-Video Grab)

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)