Andhra Pradesh: ఎన్నికల ప్రచారాన్ని ఆపేసి తల్లీ బిడ్డను రక్షించేందుకు ఆస్పత్రికి పరిగెత్తిన టీడీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, వీడియో ఇదిగో..

సమాచారం వచ్చిన వెంటనే స్పందించిన డాక్టర్ లక్ష్మి.. గైనకాలజిస్టు కావడంతో వెంటనే దర్శిలోని ఆసుపత్రికి వెళ్లారు. ఎమర్జెన్సీగా మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. మహిళ బంధువులు గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ, మనవడ్ని కాపాడిన లక్ష్మికి మహిళ తల్లి ధన్యవాదాలు తెలిపారు.

TDP Darsi candidate Dr Gottipati Lakshmi put off election campaign and saves a mother & child performing C-section

టీడీపీ దర్శి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని నిలిపివేసి తల్లి & బిడ్డను కాపాడారు. తల్లికి సమస్యలు వచ్చినప్పుడు మరియు వెంటనే హాజరు కావడానికి గైనకాలజిస్ట్ లేకపోవడంతో ఆమెను మెడికల్ ఎమర్జెన్సీ కోసం పిలిచారు, విషయం తెలుసుకున్న డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి వెంటనే ప్రచారాన్ని నిలిపివేసి తల్లి & బిడ్డను కాపాడేందుకు ఆస్పత్రికి వెళ్లారు. ఎమర్జెనీగా వెళ్లి ఆమెకు ఆపరేషన్ చేసి తల్లీ బిడ్డ ప్రాణాలను కాపాడారు.

దర్శి మండలం అబ్బాయిపాలేనికి చెందిన వెంకట రమణ గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను దర్శిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో అత్యవసరంగా ఆపరేషన్ చేయాలని అక్కడి వైద్య సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో సదరు ఆసుపత్రి వైద్యురాలు అందుబాటులో లేరు.. వెంటనే అక్కడికి వచ్చే పరిస్థితి లేకపోయింది. అదే సమయంలో ఆస్పత్రి సిబ్బంది టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికి ఆమె దర్శి నుంచి 20 కిలో మీటర్ల దూరంలోని కురిచేడులో ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.

సమాచారం వచ్చిన వెంటనే స్పందించిన డాక్టర్ లక్ష్మి.. గైనకాలజిస్టు కావడంతో వెంటనే దర్శిలోని ఆసుపత్రికి వెళ్లారు. ఎమర్జెన్సీగా మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడారు. మహిళ బంధువులు గొట్టిపాటి లక్ష్మికి కృతజ్ఞతలు తెలిపారు. తమ బిడ్డ, మనవడ్ని కాపాడిన లక్ష్మికి మహిళ తల్లి ధన్యవాదాలు తెలిపారు.తల్లిబిడ్డల ప్రాణాలను కాపాడటం ఎంతో ఆనందంగా ఉందని.. ఆ తల్లి మొహంలో ఎనలేని సంతోషాన్ని చూడగలిగానని భావోద్వేగంతో చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now