Vangaveeti Radhakrishna Health Update: వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటు, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో టీడీపీ నేత

టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు.

TDP leader Vangaveeti Radhakrishna suffered a mild heart attack (Photo/X)

టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ స్వల్వ గుండెపోటుకు గురయ్యారు. గురువారం తెల్లవారుజామున ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్‌లో వంగవీటి రాధా ఉన్నారు. రాధా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు.

హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఆపరేషన్ వికటించి యువకుడు మృతి, నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు

48 గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని సూచించారు. విజయవాడ నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని సమాచారం. కాగా వంగవీటి రాధా గుండెపోటు వార్త తెలుసుకున్న అభిమానులు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకుంటున్నారు. పలువురు ఆయన ఇంటికి వెళ్లి మరీ వివరాలు కనుక్కున్నారు. కాగా రాధా ఆరోగ్య పరిస్థితి గురించి రాజకీయ నాయకులు, మిత్రులు అడిగి తెలుసుకుంటున్నారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now