Game Changer Event Tragedy: గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి, మృతుల కుటుంబాలకు జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan (photo-X)

గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజ‌రై తిరిగి వెళుతుండ‌గా రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందిన ఇద్ద‌రు అభిమానుల కుటుంబాల‌కు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిహారం ప్ర‌క‌టించారు. జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామ‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న‌పై దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ప్ర‌మాదం జ‌రిగిన కాకినాడ‌-రాజ‌మండ్రి రోడ్డును గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేద‌ని ఆయ‌న ఆరోపించారు. పాడైపోయిన రోడ్డును కొంత‌కాలంగా బాగు చేస్తున్న‌ట్లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక‌లో పాల్గొని తిరిగి ఇళ్ల‌కు వెళుతున్న క్ర‌మంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ, తోకాడ చరణ్‌ ప్ర‌మాద‌వ‌శాత్తు మృతిచెంద‌డం బాధించింద‌ని పేర్కొన్నారు. మృతుల‌ కుటుంబాల‌కు జ‌న‌సేనాని ప్ర‌గాఢ సానుభూతి తెలియ‌జేశారు.

గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు మృతి, ఇద్దరి కుటుంబాలకు రూ. 5 లక్షలు ప్రకటించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, వీడియో ఇదిగో..

Pawan Kalyan Tweet on Game Changer Event Tragedy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement