విజయవాడలో జరిగిన గేమ్ చేంజర్' సినిమా వేడుకకు వెళ్లివస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) శనివారం రాజమహేంద్రవరంలోని వేమగిరిలో జరిగిన రామ్ చరణ్ సినిమా ‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ కోసం బైక్‌పై వచ్చారు. అయితే, అక్కడ జనం ఎక్కువగా ఉండటంతో తిరిగి కాకినాడ బయలుదేరారు.

ఏపీలో గేమ్ ఛేంజర్ టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్.. బెనిఫిట్‌ షోకు అనుమతి, తొలి రోజు 6 షోలకు అనుమతి

రాజమండ్రి - రంగంపేట మండలం ఏడీబీ రోడ్డులో కార్గిల్ ఫ్యాక్టరీ సమీపంలో బైక్ పై వెళ్తుండగా వ్యాన్ ఢీకొట్టింది. దీంతో బైక్ పై ఉన్న మణికంఠ (23) అక్కడికక్కడే మృతి చెందగా తీవ్రంగా గాయపడిన చరణ్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతులు కాకినాడకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి కుటుంబాలకు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ప్రొడ్యూసర్ దిల్ రాజు.

రూ. 5 లక్షలు ప్రకటించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)