Ugadi 2024: ఉగాది సందర్భంగా సీఎం జగన్ దంపతులకు పండితుల వేద ఆశీర్వచనం, తెలుగు ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఏపీ ముఖ్యమంత్రి
ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం జరిగింది.
ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం పండితులు అందించిన ఉగాది పచ్చడిని సీఎం దంపతులు స్వీకరించారు. శావల్యాపురం మండలం గంటావారిపాలెం వద్ద క్యాంపులోనే కార్యక్రమం జరిగింది. శాలువా కప్పి, అక్షింతలు చల్లి ఆశీర్వాదం ఇచ్చారు. కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరాది సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ క్రోధి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు అన్నీ శుభాలు, విజయాలు సిద్ధించాలని సీఎం ఆకాంక్షించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)