Ram Mohan Naidu: ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మెన్‌గా కింజరాపు రామ్మోహన్‌నాయుడు, ఏకగ్రీవంగా ఎన్నికైన కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి

ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్‌ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్‌ ప్రతిపాదించగా భూటాన్‌ బలపరిచింది.

Ram Mohan Naidu (photo-PTI)

ఆసియా పసిఫిక్‌ సభ్యదేశాల ఛైర్మన్‌గా కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న రెండవ ఆసియా-పసిఫిక్‌ మంత్రుల స్థాయి సదస్సులో బుధవారం ఆయన ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రామ్మోహన్‌నాయుడి పేరును సింగపూర్‌ ప్రతిపాదించగా భూటాన్‌ బలపరిచింది. మిగతా సభ్యదేశాలన్నీ ఆమోదం తెలపడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని తాను బాధ్యతగా స్వీకరిస్తానని పేర్కొన్నారు. విమానయాన రంగాన్ని సాధారణ ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సభ్యదేశాల మధ్య రాకపోకలను సులభతరం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెప్పారు.

ఓరేయ్ కౌశిక్ రెడ్డి దమ్ముంటే రా అని సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే గాంధీ, నీ ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగరేసి తీరుతానని కౌశిక్ మరోసారి సవాల్

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now