Gangavaram Port: విశాఖ గంగవరం పోర్టులో తీవ్ర ఉద్రిక్తత, బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ ఆందోళనకు దిగిన కార్మికులు
విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఒక్కసారిగా గంగవరం పోర్టులోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బొగ్గు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు యాజమాన్యంపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలోనే గాజువాక బాలచెరువు వైపు ఉన్న స్టీల్‌ప్లాంట్ గేట్ నుంచి కార్మికులు గంగవరం పోర్టులోకి ప్రవేశించేందుకు యత్నించారు.దీంతో పోర్టు గేట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు పోర్టు గేట్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గేట్ వద్ద ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. పోలీసులతో పాటు గంగవరం పోర్టు ఫైర్, ఇతర రక్షణ సిబ్బంది పెద్ద ఎత్తున మోహరించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)