Prashant Kishor: వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుతో కలిసి పనిచేయడం లేదు, షాకిచ్చిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, వీడియో ఇదిగో...

ఓ ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిషోర్‌ దీనిపై స్పష్టత ఇస్తూ.. చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడనని, అందుకు తాను కుదరదని చెప్పానని పేర్కొన్నారు..

Chandrababu and Prashanth Kishor (FB and ANI)

వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చంద్రబాబు కలిసి పనిచేస్తున్నారనే వార్తలపై తాజాగా ప్రశాంత్‌ కిషోర్‌ క్లారిటీ ఇచ్చారు. ఓ ఫేస్‌ టు ఫేస్‌ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌ కిషోర్‌ దీనిపై స్పష్టత ఇస్తూ.. చంద్రబాబు తన కోసం ఎన్నికల్లో పని చేయమని అడిగాడనని, అందుకు తాను కుదరదని చెప్పానని పేర్కొన్నారు..

డిసెంబర్‌ చివరి వారంలో ఒకే ఫ్లైట్‌లో నారా లోకేష్‌తో కలిసి విజయవాడకు వెళ్లిన విషయాన్ని యాంకర్‌ ప్రశ్నించారు. చంద్రబాబును కలవడానికే తాను విజయవాడకు వెళ్లానని, అయితే చంద్రబాబుకి తనకు కామన్‌ స్నేహితుడైన ఓ పెద్ద నేత.. చంద్రబాబు తనను ఎప్పటి నుంచో కలవాలని కోరుకుంటున్నాడని చెప్పారు. అందుకే విజయవాడకు చంద్రబాబును కలవడానికి మాత్రమే వెళ్లానని చెప్పారు.ఈసారి ఏపీలో అటు ప్రభుత్వానికి.. ఇటు ప్రతిపక్షానికి ఏ పార్టీకి తాను పని చేయబోనని క్లారిటీ ఇచ్చారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)