Jagan Phone Call to CS Rangarajan: వీడియో ఇదిగో, చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌‌కు జగన్ పరామర్శ, తమకు కొండంత బలమని తెలిపిన రంగరాజన్‌

చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఆయనను పరామర్శించారు. ఘటన వివరాలన అడిగి తెలుసుకున్నారు.

Jagan Phone Call to CS Rangarajan

చిలుకూరు బాలాజీ టెంపుల్‌ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో ఆయనను పరామర్శించారు. ఘటన వివరాలన అడిగి తెలుసుకున్నారు. రంగరాజన్ యోగక్షేమాలు తెలుసుకున్న వైఎస్‌ జగన్.. ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తూ.. భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ.. ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్న రంగరాజన్ కుటుంబంపై దాడి బాధాకరమన్నారు.

వీడియో ఇదిగో, రేపు మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీకు పోలీస్ భద్రత ఇవ్వకపోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకో, చంద్రబాబుకు జగన్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరానికి చెందిన కొవ్వురి వీర రాఘవరెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేశారు. 2022లో ఫేస్‌బుక్‌ వేదికగా రామరాజ్యం సంస్థను ఆయన ప్రారంభించారు. ఈ నెల 7న మూడు వాహనాల్లో, 25 మంది సభ్యులతో కలిసి వీర రాఘవరెడ్డి చిలుకూరు దేవాలయం వద్దకు వచ్చాడు. అర్చకుడు రంగరాజన్‌ ఇంట్లోకి వెళ్లి రామరాజ్యం సైన్యానికి వ్యక్తులను పంపాలని, ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. దానికి రంగరాజన్‌ అంగీకరించకపోవడంతో అతనిపై దాడి చేశారు. దీనిపై రంగరాజన్‌ ఈ నెల 8న మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Jagan Phone Call to CS Rangarajanచిలుకూరు అర్చకులు రంగరాజన్‌కు వైయస్ జగన్ పరామర్శ

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement