Andhra Pradesh Elections 2024: కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువస్తా, ఏపీ పీసీసీ చీఫ్ నియామకం తర్వాత షర్మిల ఆసక్తికర ట్వీట్
దీనిపై షర్మిల స్పందించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
షర్మిలను ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన విడుదల చేసింది. దీనిపై షర్మిల స్పందించారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడం ద్వారా నాపై నమ్మకం ఉంచిన ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, కేసీ వేణుగోపాల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పునర్ వైభవం అందించేలా పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో, విధేయతతో పనిచేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ సందర్భంగా నేను మాణికం ఠాగూర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రతి ఒక్క కాంగ్రెస్ సైనికుడితో కలిసి చేయి చేయి కలిపి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అంతేకాదు, మాజీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు గారు, రాష్ట్రంలోని ఇతర కాంగ్రెస్ నేతలందరి మద్దతును కోరుకుంటున్నాను. వారందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలను అందుకునేలా పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)