YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు, అరెస్ట్ సంకేతాలు, ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి
వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కాగా నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.కాగా నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు.కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఆయనను అదుపులోకి తీసుకునేందుకే హైదరాబాద్, కడప నుంచి సీబీఐ అధికారులు కర్నూలుకు చేరుకున్నారని చెపుతున్నారు. తన తల్లి ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నారని, ఇప్పుడు విచారణకు హాజరుకాలేనని అవినాశ్ రెడ్డి లేఖ రాసినప్పటికీ సీబీఐ అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలో అవినాశ్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వెకేషన్ బెంచ్ ముందు పిటిషన్ ను అవినాశ్ న్యాయవాది మెన్షన్ చేశారు. జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహ బెంచ్ ముందు మెన్షన్ చేశారు.
Here's News