Kiran Royal: నాకు రోజుకి ఒక అమ్మాయి పక్కలోకి కావాల్సిందే, జనసేన తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ చెబుతున్నట్లుగా ఆడియో వైరల్, ఎక్స్ వేదికగా షేర్ చేసిన వైసీపీ పార్టీ
జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారంలో మరో క్లిప్ బయటకు వచ్చింది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్ మాట్లాడారని చెబుతున్న ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది.
జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ వ్యవహారంలో మరో క్లిప్ బయటకు వచ్చింది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్ మాట్లాడారని చెబుతున్న ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలు లక్ష్మి విడుదల చేసిన ఆడియోలో ఏమని ఉందంటే.. ‘‘నాకు అమ్మాయిలు వీక్ నెస్ ఉంది. నేను లైఫ్ లాంగ్ ఇలానే ఉంటా. నేను మారలేను. కానీ, నిన్ను మాత్రం బాగా చూసుకుంటా అని చెప్పినట్లుగా ఉంది.
ఎన్నికల్లో తిరుపతి జనసేన నుంచి పోటీ చేయాలని చేయాలి అంటే రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని అన్నారు. చివరకు నాకు సీటు లేదని చెప్పేశారు. అయినా ఏం ఫర్వాలేదు. ఏదో ఒక నామినేటెడ్ పదవి గ్యారెంటీగా వస్తుంది. కూటమి ప్రభుత్వం(Kutami Prabutvam) రాగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా’’ అని కిరణ్ రాయల్(Kiran Royal) చెప్పినట్లుగా ఆడియో ద్వారా తెలుస్తోంది. దీన్ని వైసీపీ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. దీనిపై కిరణ్ రాయల్ స్పందన తెలియాల్సి ఉంది.
జనసేన తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ చెబుతున్నట్లుగా ఆడియో వైరల్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)