IPL Auction 2025 Live

Delhi Excise Policy Case: ఇది మనీ లాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు, కడిగిన ముత్యంలో బటయకు వస్తానని తెలిపిన ఎమ్మెల్సీ కవిత

ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మనీ లాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ లాండరింగ్‌ కేసని విమర్శలు గుప్పించారు.

kavitha (photo-ANI)

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు నేటితో ఈడీ కస్టడీ ముగియడంతో ఎమ్మెల్సీ కవితను అధికారులు రౌస్‌ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఇది మనీ లాండరింగ్‌ కేసు కాదని, పొలిటికల్‌ లాండరింగ్‌ కేసని విమర్శలు గుప్పించారు. తాను కడిగిన ముత్యంలో బటయకు వస్తానని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. తన ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడని, మరో నిందితుడు అప్రూవర్‌గా మారాడని, మూడో నిందితుడు ఎలక్టోరల్‌ బాండ్ల రూపంలో బీజేపీకి రూ.50 కోట్లు ఇచ్చాడు. తాను ఏ తప్పూ చేయలేదని, అప్రూవర్‌గా మారేది లేదని స్పష్టం చేశారు. క్లీన్‌గా బయటకు వస్తానని చెప్పారు.

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు