Delhi Liquor Policy Case: ఢిల్లీ మద్యం కేసు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ జులై 3 వరకు పొడిగించిన రౌస్‌ అవెన్యూ కోర్టు

ఈ మేరకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు.

BRS Leader K Kavitha (File Image)

ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. దాన్ని న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది. మరోవైపు సీబీఐ కేసులో కవిత జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపుపై మధ్యాహ్నం 2 గంటలకు విచారణ సాగనుంది. దీని కోసం ఆమెను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరచనున్నారు. కోర్టులోకి వస్తున్న సందర్భంలో ఎమ్మెల్సీ కవిత ‘జై తెలంగాణా, జై భారత్’ అంటూ నినాదాలు చేశారు.  నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌..నేడు రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చనున్న తీహార్ జైలు అధికారులు

Here's Video 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)