Falcon Scam Probe: ఫాల్కన్ స్కామ్ రంగంలోకి దిగిన ఈడీ..శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ, వివరాలివే
ఫాల్కన్ స్కామ్ కేసులో రంగంలోకి దిగింది ఈడీ, కస్టమ్స్(Falcon Scam Probe). శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ చేపట్టారు.
ఫాల్కన్ స్కామ్ కేసులో రంగంలోకి దిగింది ఈడీ, కస్టమ్స్(Falcon Scam Probe). శంషాబాద్ ఎయిర్ పోర్టులో ల్యాండైన చార్టర్డ్ ఫ్లైట్ కొనుగోలుపై విచారణ చేపట్టారు. ప్రెస్టేజ్ జెట్స్ కంపెనీ పేరుతో ఫ్లైట్ కొన్న అమర్ దీప్ కుమార్. 1.6 మిలియన్ పౌండ్లు చెల్లించి ఫ్లైట్ కొన్నారు అమర్ దీప్.
12 సీట్ల చార్టర్డ్ ఫ్లైట్ లో ఎంజాయ్ చేయగా జనవరి 22న చార్టర్డ్ ఫ్లైట్ లో అమర్, వివేక్ సేతులు పరారీ అయినట్లు గుర్తించారు(Shamshabad Airport). విదేశాల్లో ఎంజాయ్ చేసేందుకు చార్టర్డ్ ఫ్లైట్ కొన్నారు అమర్ దీప్. మెడికల్ ఎమర్జెన్సీ పేరుతో ఎయిర్ పోర్టులో ల్యాండైంది ఫ్లైట్.
పైలెట్, కోపైలెట్ లను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత మెడికల్ ఎమర్జెన్సీ లేకపోవడంతో ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫ్లైట్ ని టేకోవర్ చేసుకునేందుకు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. 12 గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి ఫాల్కన్ సంస్థకు చెందిన ఫ్లైట్ ను స్వాధీనం చేసుకుంది ఈడీ.
ED and Customs Step In Falcon Scam Probe
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)