Jagitial Bribe Row: లంచం అడిగిన అధికారి మెడలో నోట్ల దండ వేసి ‘సత్కారం’ చేసిన మత్స్యకార సంఘాల సభ్యులు.. వీడియోతో
జగిత్యాల జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు.
Jagitial, Dec 12: జగిత్యాల (Jagitial) జిల్లా మత్స్యశాఖ అధికారి లంచం (Bribe) కోసం పీడిస్తున్నాడని ఆరోపిస్తూ మత్స్యకారులు వినూత్న రీతిలో నిరసనకు దిగారు. లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి దామోదర్ మెడలో నోట్ల దండ వేసి సత్కరించారు. అధికారి దండ తీసి పడేసి తన కార్యాలయానికి వెళుతుండగా మరోమారు మత్స్యకారులు అతడి మెడలో దండ వేశారు. అయితే, మత్స్యకారుల మధ్య గొడవలతోనే వారు తనపై ఆరోపణలు చేస్తున్నారని దామోదర్ చెప్పుకొచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)