Newdelhi, Dec 12: ఖరీదైన సోనీ హెడ్ ఫోన్స్ (Sony Headphones) ను అమెజాన్ ద్వారా ఆర్డర్ చేస్తే.. దానికి బదులు కోల్ గేట్ టూత్ పేస్ట్ డెలివరీ అయ్యింది. ఈ ఘటన తో కంగుతిన్న సదరు కస్టమర్ తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఓజాహ్ అనే వ్యక్తి ఎక్స్ లో (X) ఓ వీడియో షేర్ చేశాడు. ‘సోనీ XB910N వైర్ లెస్ హెడ్ ఫోన్ లను అమెజాన్ ద్వారా రూ. 19,900కి ఆర్డర్ చేశాను. కానీ దానికి బదులుగా కోల్ గేట్ టూత్ పేస్ట్ (Colgate Toothpaste)ను అందుకున్నాను’ అంటూ అమెజాన్ డెలివరీని అన్ బాక్సింగ్ చేసే వీడియోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై అమెజాన్ సంస్థ కూడా స్పందించింది. ఘటనకు గానూ అతడికి క్షమాపణలు చెప్పింది. ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది.
Well I ordered sony xb910n and got Colgate lmafao. pic.twitter.com/GpsiLWemwl
— Yash ojha (@Yashuish) December 8, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)