దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ సీఎం భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టే లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు. తాజాగా మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకే చోట కూర్చుని మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మా పోటీ అమరావతితో కాదని (CM Revanth Reddy on Amaravati) న్యూయార్క్, టోక్యో, సింగపూర్‌, చైనా దేశాలతో పోటీ పడాలనే తన టార్గెట్ చెప్పుకొచ్చారు. మా బలం హైదరాబాద్ సిటీ అని చెప్పుకొచ్చారు. అమరావతి మాత్రమే కాదు.. దేశంలోని ఏ మెట్రోపాలిటిన్ సిటీ.. హైదరాబాద్‌కు పోటీ కాదన్నారు. ఈ వ్యాఖ్యలు విన్న ఏపీ సీఎం చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్ఫోసిస్‌ గుడ్ న్యూస్, కొత్తగా 17 వేల ఉద్యోగాలు, పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం

CM Revanth Reddy on Amaravati:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)