దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పర్యటన కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా తెలంగాణ సీఎం భారీ పెట్టుబడులను రాష్ట్రానికి రాబట్టే లక్ష్యంగా కంపెనీ ప్రతినిధులతో భేటీ అవుతున్నారు.ఇన్ఫోసిస్‌ సీఎఫ్‌వో సంగ్రాజ్‌తో తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో పోచారంలో ఐటీ క్యాంపస్‌ విస్తరణకు ఇన్ఫోసిస్‌ అంగీకారం తెలిపింది. రూ.750 కోట్లతో మొదటి దశ విస్తరణ చేపడతామని ఆ సంస్థ తెలిపింది. దీంతో కొత్తగా 17వేల ఉద్యోగాలు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

హైదరాబాద్‌లో విప్రో విస్తరణ..గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్‌, వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి

ప్రో (Wipro) ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీతో సీఎం రేవంత్‌ భేటీ (CM Revanth Reddy Davos Tour) అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు గల అవకాశాలపై రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు.ఈ భేటీలో హైదరాబాద్‌లోని గోపన్‌పల్లిలో కొత్త సెంటర్‌ ఏర్పాటుకు విప్రో అంగీకారం తెలిపింది. మూడేళ్లలో సెంటర్‌ పూర్తిచేస్తామని వెల్లడించింది. విప్రో కొత్త సెంటర్‌ ద్వారా 5 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు కంపెనీ తెలిపింది.

Infosys IT Campus Expansion in Pocharam:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)