CM Revanth Reddy welcomes Wipro expansion in Hyderabad(X)

హైదరాబాద్‌లో విప్రో(Wipro) విస్తరణ పనులు జరగనున్నాయి. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా విప్రో ప్రకటనను స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy). 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలకు అవకాశం లభించనుంది.

దావోస్‌(Davos)లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, విప్రో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీతో భేటీ అయ్యారు.  చంద్రబాబుకు కంప్యూటర్‌ గురించి ఏమీ తెలియదు...దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి, కనీసం కంప్యూటర్ ఆన్‌,ఆఫ్ చేయడం కూడా తెలియదని షాకింగ్ కామెంట్

విప్రో లాంటి పేరొందిన సంస్థలకు తగిన మద్దతు ఇచ్చేందుకు, వ్యాపారాలకు అనువైన వాతావరణం కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy welcomes Wipro expansion 

దావోస్(Davos) వేదికగా అతి పెద్ద ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు రానుంది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో భారీ MOU చేసుకుంది తెలంగాణ సర్కార్.

అలాగే ట్రిలియన్ ట్రీ ఉద్యమంలో భాగం అవుతామని ప్రమాణం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ విధానంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.