Telangana: ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు, హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు, వీడియోలు ఇవిగో..
ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు అయ్యారు. బుధవారం ఆయన ఇంట్లో ACB అధికారులు చేసిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు పూర్తి కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేపు ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి.
ఆదాయానికి మించిన ఆస్తుల వ్యవహారంలో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్టు అయ్యారు. బుధవారం ఆయన ఇంట్లో ACB అధికారులు చేసిన తనిఖీల్లో భారీగా ఆస్తులు బయటపడ్డాయి. సోదాలు పూర్తి కావడంతో ఆయన్ని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రేపు ఆయన్ని కోర్టులో హాజరు పరిచే అవకాశాలు ఉన్నాయి. మొత్తం 20 చోట్ల తనిఖీలు చేపట్టిన ఏసీబీ.. భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలకు స్వాధీనం చేసుకుంది. తన పదవిని, ఓ సీనియర్ ఐఏఎస్ అధికారితో సన్నిహిత పరిచయాన్ని అడ్డుపెట్టుకుని ఏకంగా రూ.500 కోట్ల వరకు అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఏసీబీ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే శివబాలకృష్ణపై ఆదాయానికి మించిన ఆస్థుల కేసు నమోదు అయ్యింది.
బాలకృష్ణను అదుపులోకి తీసుకున్నాం. రేపు ఆయన్ని కోర్టులో హాజరుపరుస్తాం. ఆ తర్వాత కోర్టు అనుమతితో కస్టడీకి తీసుకుంటాం. తనిఖీల సమయంలో కుటుంబ సభ్యులెవరూ మాకు సహకరించలేదు’’ అని ఏసీబీ ఓ ప్రకటన విడుదల చేసింది.‘బాలకృష్ణ 2018–2023 మధ్య హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా కొనసాగారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో శివబాలకృష్ణ భారీగా అవినీతికి పాల్పడి, అక్రమ ఆస్తులు కూడబెట్టినట్టుగా ఫిర్యాదులు ఉన్నాయి. బాలకృష్ణ ఇంట్లో రూ.40 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నాం. ఇంకా బ్యాంకు లాకర్లను పరిశీలించాల్సి ఉంది..’’అని ఏసీబీ డీజీ తెలిపారు.
Here's Videos
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)