Telangana Assembly Election 2023: వీడియో ఇదిగో, గులాబీ తీర్థం పుచ్చుకున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్న మాజీ టీడీపీ నేత

తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ రోజు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

Former Telangana TDP Leader Kasani Gnaneshwar Mudiraj joined BRS party

తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి ఇటీవల రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఈ రోజు అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు.బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాసానితో పాటు పలువురు నేతలు కూడా బీఆర్ఎఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో జరిగింది.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... ఈ రోజు చాలా సంతోషంగా ఉందని, తనకు పాతమిత్రుడైన కాసాని ఎప్పుడో పార్టీలోకి రావాల్సిందని, కాకపోతే కాస్త ఆలస్యమైందని అన్నారు. బండ ప్రకాశ్‌తో పాటు కాసానికి సముచితం స్థానం కల్పించేవాడినని, ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులయ్యేందుకు బీఆర్ఎస్‌లోకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నట్లు చెప్పారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now