Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్, భారీ వర్షాలకు 30కి పైగా రైళ్లు రద్దు, మరికొన్ని ట్రైన్స్ దారి మళ్లింపు, లిస్టు ఇదిగో..
మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 30కిపైగా రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్ని రైళ్లను దారిమళ్లించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది. అత్యవసర సాయం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించింది.రద్దయిన వాటిలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. రద్దయిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. భారీ వర్షాలు, రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరిక
రద్దయిన ముఖ్య రైళ్ల వివరాలివీ..
17202 సికింద్రాబాద్-గుంటూరు (గోల్కొండ ఎక్స్‌ప్రెస్)
17201 గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్)
20708 విశాఖపట్నం-సికింద్రాబాద్ (వందేభారత్)
12713 విజయవాడ-సికింద్రాబాద్ (శాతవాహన)
12714 సికింద్రాబాద్-విజయవాడ (శాతవాహన)
17233 సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ (భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్)
12706 సికింద్రాబాద్-గుంటూరు (ఇంటర్‌సిటీ)
12705 గుంటూరు-సికింద్రాబాద్ (ఇంటర్ సిటీ)
12704 సికింద్రాబాద్-హౌవ్‌డా (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్)
12703 హౌవ్‌డా-సికింద్రాబాద్ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్)
17230 సికింద్రాబాద్-తిరువనంతపురం (శబరి ఎక్స్‌ప్రెస్)
17229 తిరువనంతపురం-సికింద్రాబాద్ (శబరి ఎక్స్‌ప్రెస్)
12862 మహబూబ్‌నగర్-విశాఖపట్నం (సూపర్‌ఫాస్ట్)
17058 లింగంపల్లి-ముంబయి (దేవనగరి ఎక్స్‌ప్రెస్)
17057 ముంబయి- లింగంపల్లి (దేవనగరి ఎక్స్‌ప్రెస్)
12762 కరీంనగర్-తిరుపతి (సూపర్‌ఫాస్ట్)
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)