Hyderabad Fire: కొండాపుర్‌లో భారీ అగ్నిప్రమాదం, గాలక్సీ అపార్ట్మెంట్స్ 9వ అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలడంతో చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..
గెలక్సీ అపార్ట్ మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్టుమెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.
హైదరాబాద్ లోని కొండాపుర్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గెలక్సీ అపార్ట్ మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్టుమెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. ఇంట్లో ఉన్న ఫర్నిచర్ కు మంటలు అంటుకోవడంతో పొగలు వ్యాపించాయి. సిలిండర్ పేలిన సమయంలో పెద్ద ఎత్తున శబ్దం రావడంతో అపార్ట్ మెంటు వాసులు బయటకు పరుగులు తీశారు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో ఇంట్లో ఒకరు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటన సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అర్పుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
fire broke out on the 9th floor of Galaxy Apartments in Kondapur
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)