Heavy Rains In Hyderabad: హైదరాబాద్ లో దంచి కొట్టిన వర్షం, ఉరుములు-మెరుపులతో పలు చోట్ల భారీ వర్షం, రహదారులు జలమయం..వీడియోలు ఇదిగో
హైదరాబాద్‌ను భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, బాలానగర్, జీడిమెట్ల, నాంపల్లి, హిమాయత్ నగర్,ఆర్టీసీ క్రాస్ రోడ్, తార్నాక, కోఠి,సరూర్‌నగర్, రామంతాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.

పలు చోట్ల రోడ్లు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటూ వర్షాలు, పలు జిల్లాలకు ఐఎండీ అలర్ట్, ఏయే ప్రాంతాల్లో వానలు పడుతాయంటే?
Here's Video:
ఒక్కసారిగా కుండపోత వర్షంతో బస్తీలు, కాలనీలు జలమయమయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. పిడుగులు పడే అవకాశం ఉండటంతో చెట్ల కింద ఎవరూ ఉండొద్ది, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.
Here's Video:
— Manoj (@manoj_1023) September 20, 2024