Wife Beat Husband: నన్ను నా భార్య కత్తితో చంపేందుకు ప్రయత్నిస్తోంది, పోలీసుల ముందు గోడు వెళ్లబోసుకున్న భర్త, వీడియో ఇదిగో..

తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని... రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు.పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.

Hyderabad husband complained to the police that his wife was beating him

తన భార్య నుండి తనకు, తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని... రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్నారు.పెళ్ళైనప్పటి నుండి తనను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశాడు. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నాడు.

ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్ కు అమలాపురంకు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరగగా మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. అయితే పెళ్లైనప్పటి నుండి తనను అకారణంగా హింసిస్తుందని, పలుమార్లు పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు తెలిపాడు.

ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని... అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం , పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని ప్రశ్నించారు. తాను నిన్నటి నుండి ఇంటికి వెళ్లలేదని , వెళ్తే తన భార్య మళ్ళీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి , తనకు రక్షణ కల్పించాలని బాధిత భర్త వేడుకున్నాడు.  భార్య రోజూ చితక్కొడుతుందంటూ కట్ డ్రాయర్ మీద పోలీస్ స్టేషన్‌కి పరిగెత్తిన భర్త, అవతారం చూసి ఒక్కసారిగా ఖంగుతున్న పోలీసులు

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Andhra Pradesh: వీడియో ఇదిగో, కీలక సమావేశాన్ని వదిలేసి ఆన్‌లైన్‌‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కిన డీఆర్ఓ, ప్రజా సమస్యలను పక్కనపెట్టి ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు, వాట్సాప్‌ గవర్నెన్స్‌ సేవలను అందుబాటులోకి తీసుకురానున్న చంద్రబాబు సర్కారు

Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ

World Economic Forum in Davos: దావోస్ పర్యటనలో కలుసుకున్న తెలుగు రాష్ట్రాల సీఎంలు, విదేశీ పెట్టుబడుల కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరైన చంద్రబాబు, రేవంత్ రెడ్డి

Share Now