Murder For Extra Curd: ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు పోలీసుల ముందే యువకుడిని కొట్టి చంపిన ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్, మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత

అంతేకాకుండా తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్

HYD Police Commissioner CV Anand (Photo: Twitter/@CPHydCity)

హైదరాబాద్ - పంజాగుట్టలోని మెరిడియన్ రెస్టారెంట్లో ఎక్స్‌ట్రా పెరుగు అడిగినందుకు లి యాకత్ అనే యువకుడి పై హోటల్ సిబ్బంది దాడి చేసిన సంగతి విదితమే. ఈ దాడిలో లియాకత్ స్పృహ తప్పి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు.ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. మెరిడియన్ రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా తమ ముందే దాడి చేస్తున్నా నిర్లక్ష్యం వహించిన పంజాగుట్ట సబ్ ఇన్స్పెక్టర్ శివ శంకర్, హెడ్ కానిస్టేబుల్ రమేష్ లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవి ఆనంద్

HYD Police Commissioner CV Anand


సంబంధిత వార్తలు