PM Modi's Roadshow: మెట్రో ప్రయాణికులకు అలర్ట్, చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేత, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ప్రధాని మోదీ రోడ్ షో
రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
హైదరాబాదులో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రోడ్డు షో నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్‌లను ఈ రోజు( సోమవారం ) సాయంత్రం మూసివేయనున్నారు. రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు.
ఈ సందర్బంగా నగరంలో భారీగా బలగాలను మోహరించారు. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని మోదీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి వెంకటేశ్వరస్వామి ఆర్చ్, ఓల్డ్ వైఎంసీఏ పోలీస్టేషన్ మీదుగా కాచిగూడలోని వీరసావర్కర్ విగ్రహం వరకు రోడ్డు షోలో పాల్గొననున్నారు.
హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు..
సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి రోడ్ షో..
2 కి.మీ మేర రోడ్ షో.. కాచిగూడలో ప్రధాని ప్రసంగం..
ర్యాలీలో పాల్గొననున్న గ్రేటర్ లోని 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు
బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బేగంపేట్, గ్రీన్‌లాండ్స్, పంజగుట్ట, మొనప్ప ఐలాండ్, రాజ్‌భవన్, వీవీ విగ్రహం, నిరంకారీ భవన్..
ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ, తెలుగు తల్లి జంక్షన్, కట్టమైసమ్మ ఆలయం, ఇందిరా పార్కు, అశోక్‌నగర్ ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌కు చేరుకుంటారు.
అక్కడి నుంచి నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు రోడ్ షో ఉంటుంది.
Here's News