Hyderabad: వీడియో ఇదిగో, గుండెపోటుకు గురైన కానిస్టేబుల్ ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడిన మరో కానిస్టేబుల్, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందనల వెల్లువ

Police constable performs CPR, saves Another constable life (Photo-Video Grab)

లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుండెపోటుతో పడిపోయిన కానిస్టేబుల్ ప్రాణాలను కాపాడారు లంగర్ హౌజ్ పోలీస్ స్టేషన్‌కు చెందిన మరో కానిస్టేబుల్ నరేష్. ఉదయం 7 గంటల సమయంలో విధులకు వెళ్తున్న సంతోష్ అనే కానిస్టేబుల్ ఫ్లోర్ మిల్ వద్ద గుండెపోటుతో కింద పడిపోవడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుల్ నరేష్ CPR అందించి ప్రాణాలను రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అతనికి అభినందనలు చెబుతున్నారు.

వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో కుప్పకూలిన ప్రయాణికురాలికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన మహిళా కానిస్టేబుల్, సోషల్ మీడియాలో ప్రశంసలు

మరో ఘటనలో దేశ రాజధాని ఢిల్లీలో మహిళా కానిస్టేబుల్ ఒక ప్రయాణికురాలకిి CPR ఇవ్వడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఒక మహిళా ప్రయాణికురాలు ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడంతో అక్కడికక్కడే ఆమె స్పృహ కోల్పోయింది. అక్కడే డ్యూటీలో ఉన్న మహిళా కానిస్టేబుల్ వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని సీపీఆర్ చేసింది. కాసేపటికే ఆమె కోలుకుంది.

గుండెపోటుకు గురైన కానిస్టేబుల్ ప్రాణాలను సీపీఆర్ చేసి కాపాడిన మరో కానిస్టేబుల్

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement