Hyderabad: హైటెక్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం, ఫ్లైఓవర్‌ పైనుంచి కిందపడిన యువతి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హైటెక్ సిటీ ప్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి యువతి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Representative image. (Photo Credits: Unsplash)

మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో హైటెక్ సిటీ ప్లై ఓవర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి యువతి మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. కోల్‌కతాకు చెందిన స్విటి పాండే(22) స్నేహితుడు రాయన్‌ ల్యుకేతో కలిసి జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. రాయన్‌ ల్యుకే అతివేగంగా బైక్‌ నడుపుతూ హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై గోడను ఢీకొట్టాడు.

దీంతో బైక్‌పై వెనుక కూర్చున్న స్విటి పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్‌ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది. గోడను ఢీకొనడంతో రాయన్‌ ల్యుకేకు గాయాలయ్యాయి. గాయపడిన ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ స్విటీ పాండే కన్నుమూసింది. ఘటనపై మాదాపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

High Tech City Flyover (Photo-Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now