Telangana: సంక్రాంతి పండగ వేళ విషాదం.. గాలిపటం ఎగరవేస్తూ బిల్డింగ్ పై నుండి పడి వ్యక్తి మృతి, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘటన

సంక్రాంతి పండగ వేళ విషాదం నెలకొంది. గాలి పటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి ప్రాణాలు కొల్పోయాడు ఓ వ్యక్తి.

సంక్రాంతి పండగ వేళ విషాదం నెలకొంది. గాలి పటం ఎగరేస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి ప్రాణాలు కొల్పోయాడు ఓ వ్యక్తి. యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలం అమ్మనబోలు గ్రామంలో గాలిపటం ఎగురవేస్తూ బిల్డింగ్‌ పైనుంచి జారిపడ్డాడు నరేందర్‌ అనే వ్యక్తి. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు డాక్టర్లు.

మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఖర్ధనూరు గ్రామం వద్ద వెంకటేష్ అనే వ్యక్తి బైక్‎పై వెళ్తున్నాడు. ఈ క్రమంలో బైక్‎పై వెళ్తున్న వెంకటేష్ మెడకు చైనీస్ మాంజా కోసుకుపోయింది. మాంజా మెడను బలంగా తెంపడంతో అతడికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. గమనించిన స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేసి క్షతగాత్రుని పటాన్ చెరు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటేష్ పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితుడు వెంకటేష్ వికారాబాద్ వాసి కాగా.. పటాన్ చెరు నుండి శంకర్ పల్లికి వెళ్తుండగ ఈ ప్రమాదం జరిగింది.  వరంగల్‌లో దొంగల బీభత్సం.. వరుస చోరీలు, కట్టర్లతో తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డ దుండగులు..బాధితుల ఆవేదన

Man dies after falling from building while flying kite 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement