KTR Satirical Tweet On Amit Shah: పునాదులు వేసినందుకు అమిత్ షాకు ధన్యవాదాలు! కేంద్రహోంమంత్రి టూర్‌పై తెలంగాణ మంత్రి కేటీఆర్ సెటైర్లు
పునాది వేసినందుకు హెచ్‌ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్ మంజూరు చేయలేదని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని పరోక్షంగా సెటైర్లు వేశారు.
Hyderabad, April 23: తెలంగాణ ఐటీ, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (KTR) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amith Shah Tour) పర్యటనపై సెటైర్లు వేశారు. పునాది వేసినందుకు హెచ్‌ఎం అమిత్ షా జీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్.. రాష్ట్రానికి కేంద్రం చేసింది ఏమీ లేదని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఐటీఐఆర్ మంజూరు చేయలేదని, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేదని పరోక్షంగా సెటైర్లు వేశారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ, ఐఐఎం, ఐఐఎస్‌ఈఆర్, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ, ఎన్‌ఐడీ, నవోదయ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఇవ్వలేదంటూ వంగ్యాస్త్రాలు (Ktr Satirical Tweet) సంధించారు. గత తొమ్మిదేళ్లలో తెలంగాణ కంటే మెరుగ్గా ఉన్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రాన్ని చూపించగలరా అంటూ సవాల్ విసిరారు. ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి చేవేళ్ల పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అమిత్‌షాను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ చేసిన ట్వీట్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.