MP Revanth Reddy: తెలంగాణ నూతన సెక్రటేరియట్‌కు వెళ్లేందుకు యత్నించిన ఎంపీ రేవంత్ రెడ్డి, అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది
తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఓ పని మీద స్పెషల్ సిఎస్ అరవింద కుమార్ ను కలిసేందుకు వెళ్లగా, సచివాలయం సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు.
తెలంగాణ నూతన సెక్రటేరియట్ కు పీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డి, ఓ పని మీద స్పెషల్ సిఎస్ అరవింద కుమార్ ను కలిసేందుకు వెళ్లగా, సచివాలయం సెక్యూరిటీ సిబ్బంది ఆయనను అడ్డుకున్నారు. దీంతో ఒక ఎంపీగా తనకు ప్రభుత్వంతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ఉందని తన హక్కులను అడ్డుకోవడం అప్రజాస్వామికమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.ORR టెండర్ల వ్యవహారంపై స్పెషల్ CS అరవింద్ కుమార్‌ను కలిసేందుకు వెళితే, తనకు అనుమతి లేదని గేటు దగ్గరే ఆపిన తీరుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎంపీగా సెక్రటేరియట్ వెళితే పోలీసులకు అభ్యంతరం ఏముందంటూ ఆయన ప్రశ్నించారు. సెక్రటేరియట్‌కు వెళ్లకుండా పోలీసులు తనను ఆపడం అప్రజాస్వామికమని, రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం పోలీసులతో తనను అడ్డుకుంటోందని ఆరోపించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)