Munugode By-Election: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతి, ఫైనల్ చేసిన ఏఐసీసీ

పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్‌ జనరల్‌​ సెక్రటరీ ముఖుల్‌ వాస్నిక్‌ ప్రకటించారు.

Congress Flag (Photo Credits: PTI)

తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థిని ఏఐసీసీ ఖరారు చేసింది. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా కాంగ్రెస్‌ జనరల్‌​ సెక్రటరీ ముఖుల్‌ వాస్నిక్‌ ప్రకటించారు. కాగా, అంతకుముందు టీపీసీసీ నలుగురు అభ్యర్థుల జాబితాను ఢిల్లీకి పంపించింది. అందులో పాల్వాయి స్రవంతి, కృష్ణారెడ్డి, కైలాష్ నేత, పల్లె రవి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్‌ అధిష్టానం పాల్వాయి స్రవంతి వైపే మొగ్గుచూపింది. మునుగోడు నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్టలు ఉండటం కూడా ఆమెకు కలిసొచ్చింది. గతంలోనూ స్రవంతి అక్కడ నుంచి పోటీచేసి చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు సాధించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)