Nagoba Jatara Begins: ప్రారంభమైన నాగోబా జాతర..గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, జాతరలో హైలైట్‌గా నిలవనున్న ప్రజాదర్బార్‌

మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా(Nagoba Jatara Begins). పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది.

Nagoba Jatara Begins In Telangana Keslapur(Video grab)

మేడారం సమ్మక్క సారక్క జాతర తర్వాత అడవిబిడ్డలు నిర్వహించుకొనే జాతర నాగోబా(Nagoba Jatara Begins). పుష్య మాస అమావాస్య రోజున నాగోబా జాతర మొదలవుతుంది. ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా దేవాలయం ఉండగా జాతర కోసం మహారాష్ట్ర , చత్తీస్‌ఘడ్‌ నుంచి ప్రజలు పెద్ద ఎత్తున్న ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌(Keslapur)కు చేరుకున్నారు.

గోదావరి నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో నాగేంద్రునికి మేస్రం వంశీయుల అభిషేకం, ప్రత్యేక పూజలు చేయగా మహా పూజ అనంతరం నాగోబా జాతర ఉత్సవాలు మొదలు అయ్యాయి. అత్యంత ప్రాచీన నాగరికత కలిగిన ఈ జాతరలో భాగంగా ఆదివాసీలు(Tribals)అడవిని పూజించడం ఆనావాయితీగా వస్తోంది.

ఇందులో ప్రతి మొక్కను, చెట్టును, పుట్టను మొక్కి తమ తమ కొర్కెలను తీర్చుకుంటారు. ఈ పూజా విధానం చాలా వరకు మెస్రం వంశీయుల నుండి ఆచారంగా, వంశపారపర్యంగా కొనసాగిస్తున్నారు. ఇక ఈ జాతరలో కీలకమైన ప్రజాదర్బార్‌ లో  మంత్రులు, కలెక్టర్‌, వివిధశాఖల అధికారులు హాజరై గిరిజనుల సమస్యలకు పరిష్కారం చూపడం ఇక్కడి ప్రత్యేకత.  హుస్సేన్‌సాగర్‌లో అగ్ని ప్రమాదం, గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం, బోటు ప్రమాదంలో ఇద్దరు మృతి 

Nagoba Jatara Begins In Telangana Keslapur

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement