Numaish Exhibition End: ముగిసిన నుమాయిష్ పండుగ.. 49 రోజుల్లో 24 లక్షల మంది సందర్శకులు.. చివరి రోజు దాదాపు 80 వేలకు పైగా సందర్శకులు
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించిన నుమాయిష్ ఆదివారంతో ముగిసింది. 49 రోజులుగా జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ను దాదాపు 24 లక్షల వరకు సందర్శకులు సందర్శించారు.
Hyderabad, Feb 19: హైదరాబాద్ (Hyderabad) లోని నాంపల్లి ఎగ్జిబిషన్ (Nampally Exhibition) మైదానంలో నిర్వహించిన నుమాయిష్ ఆదివారంతో ముగిసింది. 49 రోజులుగా జరిగిన ఈ ఎగ్జిబిషన్‌ను దాదాపు 24 లక్షల వరకు సందర్శకులు సందర్శించారు. చివరి రోజైన ఆదివారం దాదాపు 80 వేలకు పైగా సందర్శించారు. 1938లో మొదట పబ్లిక్ గార్డెన్స్ లో వంద స్టాళ్లతో ప్రారంభించిన నుమాయిష్ (Numaish).. క్రమ, క్రమంగా ప్రజాదరణ పొందింది. నుమాయిష్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో ఎగ్జిబిషన్ సొసైటీ వర్గాలు తెలంగాణ జిల్లాలో వెనుకబడిన ప్రాంతాల్లో కళాశాలలను ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి పాటుపడుతున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)