Parliament's Winter Session: లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళన, తెలంగాణలో మక్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్, రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు
లోక్‌సభలో పోడియం దగ్గరకు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు (TRS MPs Protest) చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్‌లో తొలి రోజే రభస మొదలైంది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేసి రైతు సమస్యలపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. టీఆర్ఎస్ నేతలు సభలో నిరసన చేపట్టారు. లోక్‌సభలో పోడియం దగ్గరకు వెళ్లి టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు (TRS MPs Protest) చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. ధాన్యం సేకరణపై కేంద్రం తమ విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ మార్కెట్ యార్డుల్లో మక్కిపోతున్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. దీంతో స్పీకర్ బిర్లా సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. తెలంగాణ నుంచి పంటలను సేకరించకపోవడంపై కేంద్ర ప్రభుత్వ వివక్షతతో కూడిన పంట సేకరణ విధానం'పై టీఆర్‌ఎస్ ఎంపీ డాక్టర్ కే కేశవరావు (TRS MP Dr K Keshava Rao) రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు.