PM Modi In Hyderabad: కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శలు.. కుటుంబ అవినీతిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా వద్దా : మోడీ

తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి కలగాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు.

PM Modi (Photo-Video Grab)

పలు అభివృద్ధి కార్యక్రమాల పనుల కోసం హైదరాబాద్ వచ్చిన ప్రధానమంత్రి మోడీ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సమావేశంలో అధికార బీఆర్ఎస్ పార్టీ తీరును విమర్శించారు ప్రధాని మోడీ. తెలంగాణ కొందరి గుప్పిట్లో అధికారం మగ్గుతోందని మండిపడ్డారు. కుటుంబ పాలనకు విముక్తి  కలగాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర పాలనపై విమర్శలు, ఆరోపణలు చేశారాయన. ప్రతి ప్రాజెక్టులో కుటుంబ సభ్యుల ఆసక్తి తప్ప మాత్రమే ఉందని.. ప్రజల ప్రయోజనాలు చూడట్లేదన్నారు మోడీ.

అవినీతి, కుటుంబ పాలన వేర్వేరు కాదని.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలా.. వద్దా అంటూ ప్రధాని మోడీ ప్రజలను ప్రశ్నించారు. తెలంగాణను కాపాడాల్సిన అసవరం ఉందా లేదా అంటూ ప్రజలను ప్రశ్నించారు. అవినీతిపై పోరాడాలా వద్దా.. అవినీతిని తరిమి కొట్టాలా వద్దా.. తెలంగాణ ప్రజలు చెప్పాలంటూ మోడీ పిలుపునిచ్చారు. బీజేపీని అశీర్వదిస్తే రాష్ట్రాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement