Hyderabad: మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చిన ఘటనలో నలుగురు మైనర్లు అరెస్ట్, గతంలో కూడా ఈ రకమైన వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మైనర్లు
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రస్తుతం వారు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు.
కొందరు ఆకతాయిలు మహాత్మాగాంధీ విగ్రహం నోట్లో దీపావళి బాంబులు పెట్టి పేల్చి హల్‌చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రస్తుతం వారు కటకటాలు లెక్కపెట్టుకుంటున్నారు. హైదరాబాద్‌లోని బోయినపల్లి పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక బాపూజీ నగర్‌కు చెందిన 17 ఏళ్ల కుర్రాడు ముగ్గురు స్నేహితులతో కలిసి తన బంధువుల పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అక్కడ మద్యం తాగిన అనంతరం అందరూ కలిసి అక్కడున్న గాంధీ విగ్రహం వద్దకు చేరుకున్నారు.
ఈ క్రమంలో విగ్రహం నోట్లో దీపావళి బాంబు పెట్టి కాల్చారు. అది పేలడంతో గాంధీ విగ్రహం నల్లగా మారింది. అది చూసి వారు వెకిలిగా నవ్వుతూ కనిపించారు. అనంతరం ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అది వైరల్ కావడంతో కొందరు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా నలుగురు నిందితులను గుర్తించి కటకటాల వెనక్కి పంపారు.
Police arrested four minors in the incident of insulting Mahatma Gandhi
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)