Ratan Tata Dies: రతన్ టాటా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని వెల్లడి
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా, భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరు.
టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రతన్ టాటా, భారతదేశపు గొప్ప పారిశ్రామికవేత్తలలో ఒకరు. భారతదేశ కార్పొరేట్ ప్రపంచంలో దూరదృష్టి గల, మానవతావాద, ముందు చూపు ఉన్న వ్యక్తి. టాటా జీవితం వినయం & విజయంతో కూడిన అసాధారణ ప్రయాణం. టాటా కుటుంబానికి & ఈ అపారమైన నష్టానికి సంతాపం వ్యక్తం చేస్తున్న అసంఖ్యాక భారతీయులకు నా హృదయపూర్వక సానుభూతి. శ్రీ రతన్ టాటా అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయన్నారు.
రతన్ టాటా అస్తమయం..శోకసంద్రంలో వ్యాపార ప్రపంచం..భారత కార్పోరేట్ యుగంలో ముగిసిన రతన్ టాటా శకం..
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)