Telangana: వీడియో ఇదిగో, పోలీస్ స్టేషన్లో ఫిట్స్ వచ్చి కూర్చున్న చోటనే కుప్పకూలి మృతి చెందిన నిందితుడు, పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపణలు
ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు.
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో గల బెల్లంపల్లిలో 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కూర్చున్న చోటనే కీర్తి అంజి (25) అనే యువకుడు కుప్పకూలిపోయాడు. ఓ మహిళ ఇంటిపై దాడి కేసు విషయమై విచారణ కోసం పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకు రాగా అక్కడ కూర్చున్న అంజికి ఫిట్స్ రావడంతో కుప్పకూలిపోయాడు. గమనించిన సిబ్బంది వెంటనే ప్రభుత్వం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో మృతుడి చనిపోయే ముందు క్షణాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో స్టేషన్ హాల్‌లో కూర్చున్న వ్యక్తి కొద్దిసేపు ఫోన్ చూస్తూ కనిపించాడు. ఏమైందో ఏమోగానీ కాసేపటికి ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వ్యక్తి మరణానికి గల అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.కాగా పోలీసులు థర్డ్ డిగ్రీ ఉపయోగించడం వల్లే అంజీ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే నిందితుడిది లాకప్ డెత్ కాదని పోలీసులు చెబుతున్నారు. అతనికి ఫిట్స్ రావడంతో చనిపోయాడని పేర్కొన్నారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)