Telangana Assembly Elections 2023: ఒకే ఒక్క అభ్యర్థితో రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ, మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా ఏపీ మిథున్ రెడ్డి
అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం రెండో జాబితాను విడుదల చేసింది బీజేపీ. అయితే శుక్రవారం విడుదల చేసిన జాబితాలో ఒకే ఒక్క అభ్యర్థి పేరు ఉండడం గమనార్హం. మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్‌ను ఏపీ మిథున్ రెడ్డికి కేటాయించించింది కమలం పార్టీ. అక్టోబర్ 22వ తేదీన తెలంగాణ ఎన్నికలకు సంబంధించి 52 మందితో కూడిన తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదలైంది. హుజూరాబాద్, గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తారని ప్రకటించింది. అలాగే.. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బరిలోకి దిగనున్నారు. పాతబస్తీలో అన్ని స్థానాల నుంచి పోటీకి బీజేపీ సిద్ధమైంది. తొలి జాబితాలో 12 మంది మహిళలకు అవకాశం ఇచ్చింది. ముగ్గురు ఎంపీలను బరిలోకి దింపింది. బీసీలు-16, ఎస్సీలు-8, ఎస్టీలు-6, ఓసీలు-10 మందికి స్థానాలు కేటాయించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)