Telangana Assembly Sessions 2023: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, BRS ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.
నాలుగు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి, BRS ఎమ్మెల్యే కేటీఆర్‌తో పాటు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్‌కుమార్‌కు అభినందనలు తెలిపారు.
ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కూర్చోబెట్టారు. స్పీకర్ పదవికి ప్రసాద్‌కుమార్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడం, ప్రధాన ప్రతిపక్షం BRSతో పాటు మజ్లిస్, సీపీఐ ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది. అంతకుముందు పలువురు ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)