Knife Attack on MP Kotha Prabhakar Reddy: మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేసిన దుండగుడు, కడుపులో తీవ్ర గాయాలు
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా.. కడుపులో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. కత్తితో ఓ వ్యక్తి ఆయనపై దాడి చేయగా.. కడుపులో గాయం అయ్యింది. దీంతో ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. సూరంపల్లి ఎన్నికల ప్రచారంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుతం మెదక్ లోక్‌సభ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి.. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈ క్రమంలో దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. కత్తితో దాడి చేసిన నిందితుడ్ని బీఆర్‌ఎస్ కార్యకర్తలు చితకబాది పోలీసులకు అప్పగించారు. నిందితుడ్ని మిరుదొడ్డి మండలం చెప్పాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. దాడికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)