Telangana: బండి సంజయ్‌ పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు, టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, బీజేపీ నాయకులపై రాళ్లు విసిరిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు

జనగామలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది.

BJP-Chief-Bandi-Sanjay (Photo-Video Grab)

జనగామలో టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బీజేపీ నేతలపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్రలో భాగంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. పాదయాత్ర సందర్భంగా దేవరుప్పుల టీఆర్‌ఎస్‌ నాయకులు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం.. బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు రాళ్లు విసిరారు. దీంతో, వారి మధ్య వాగ్వాదం నెలకొంది. రాళ్ల దాడిలో కొందరు నేతలు తలలు పగిలిపోయాయి. రక్తం కారడంతో అంబులెన్స్‌లో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో బండి సంజయ్‌.. విధుల్లో ఉన్న సీపీ ఏం చేస్తున్నాడంటూ సీరియస్‌ అయ్యారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement