Nampally Numaish Exhibition 2024: నుమాయిష్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి, 45 రోజుల పాటు ఆ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది.
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్‌బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది. నుమాయిష్ కోసం ఈసారి 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. నుమాయిష్ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది.కాగా మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు.
Here's Video and News