Telangana CM Selection: రేవంత్ రెడ్డిని సీఎం చేయాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన కాంగ్రెస్ కార్యకర్త

గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు... రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు... కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు.

Revanth Reddy TPCC (Photo-Video Grab)

తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థిఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.అయితే అధిష్ఠానం దాదాపు రేవంత్ రెడ్డి పేరును దాదాపు ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆయన హైదరాబాద్ వచ్చాక రేవంత్ రెడ్డి పేరును ఖరారు చేయనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

గచ్చిబౌలిలోని హోటల్ ఎల్లా వద్ద పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు... రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారు హోటల్లోకి దూసుకువెళ్లే ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు... కార్యకర్తలను నిలువరించి బయటకు పంపించారు. ఈ సమయంలో ఓ కార్యకర్త ఒంటిపై పెట్రోల్ పోసుకోవడానికి ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అడ్డుకున్నారు.

Here's News

Share Now
Advertisement

Advertisement
Share Now
Advertisement