Telangana Elections 2024: మల్కాజ్‌గిరి ఎంపీ సీటు కోసం బండ్ల గణేశ్‌ దరఖాస్తు, కాంగ్రెస్‌లో చేరతామని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోమని మండిపాటు

మతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరతామని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని స్పష్టం చేశారు.

Bandla Ganesh application for Malkajgiri Parliament ticket at Congress Gandhi Bhavan

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ టికెట్ల కోసం ఆశావహులు దరఖాస్తు చేసుకుంటున్నారు. మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు నిర్మాత బండ్ల గణేశ్‌ శుక్రవారం దరఖాస్తు చేశారు. ఆయన మాట్లాడుతూ..ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పరిపాలన గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారు, రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని తెలిపారు. మతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థుల రక్తాన్ని పీల్చి పీజులు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌లో చేరతామని వచ్చినా సరే మల్లారెడ్డిని చేర్చుకోబోమని స్పష్టం చేశారు.

గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్, బీఆర్‌ఎస్‌ అధినేత చేత ప్రమాణం చేయించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌

మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం పార్లమెంటు టికెట్‌ ఆశిస్తున్నారు. ఆమె తరఫున అనుచరులు గురువారం గాంధీభవన్‌లో దరఖాస్తు అందజేశారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు కూడా అదే స్థానానికి దరఖాస్తు చేశారు. భువనగిరి స్థానానికి పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌, కె.నగేశ్‌ అప్లికేషన్‌ పెట్టుకున్నారు. నాగర్‌కర్నూల్‌కు మాజీ ఎంపీ మంద జగన్నాథం, మల్కాజిగిరికి మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్‌కుమార్‌, నిజామాబాద్‌కు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, వరంగల్‌కు న్యాయవాది చల్లూరి మధు దరఖాస్తు చేసుకున్నారు.

Here's Video

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement