తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్.. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చాంజర్‌లో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారు. అనంతరం ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఇక, కేసీఆర్‌తో స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రమాణం చేయించారు. ఎన్నికల్లో గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్ స్థానం నుంచి శాసనసభ్యుడిగా గెలుపొందిన తర్వాత ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, ఆపరేషన్ నిర్వహించడం, తదితర కారణాలతో కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. వైద్యుల సూచన మేరకు కేసీఆర్ కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకున్నారు.
Here's News
గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు శుభాకాంక్షలు తెలియచేస్తున్న పార్టీ నాయకులు. pic.twitter.com/drjVKCFY3v
— Mission Telangana (@MissionTG) February 1, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)